ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలి

ABN , First Publish Date - 2021-04-24T04:22:24+05:30 IST

వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగాలను క్రమ బద్ధీకరించాలని ఏపీ కాస్‌ ఎంప్లాయీస్‌ యూనియన ప్రతి నిధులు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలి
ఓఎస్డీకి వినతిపత్రం అందిస్తున్న ఏపీకాస్‌ ప్రతినిధులు

పులివెందుల టౌన, ఏప్రిల్‌ 23: వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగాలను క్రమ బద్ధీకరించాలని ఏపీ కాస్‌ ఎంప్లాయీస్‌ యూనియన ప్రతి నిధులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించిన వారు మాట్లాడుతూ పనికి సమాన వేతనం అమలు, అమ్మఒడి పథకాన్ని పునఃప్రారంభించాలన్నారు.

ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న మా ఉద్యోగాలు ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలోకి తీసుకు రావాలన్నారు. ధరలు పెరిగినందున జీతాలు పెంచాలన్నారు. ఏపీకాస్‌ ఎంప్లాయిస్‌ అసోసి యేషన అధ్యక్షుడు రాజు, జనరల్‌ సెక్రటరీ జయ రామకృష్ణారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌, ట్రెజరర్‌ బాబా ఫకృద్దీన పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:22:24+05:30 IST