అగ్నికి ఆహుతైన 'జోధా అక్బర్' సెట్

May 8 2021 @ 11:32AM

2008 లో 'జోధా అక్బర్' సినిమా కోసం వేసిన భారీ సెట్ అగ్నికి ఆహుతైంది. హృతిక్ రోషన్ - ఐశ్వర్య రాయ్ జంటగా దాదాపు 12 ఏళ్ళ క్రితం హిందీలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ మహల్ సెట్ తో పాటు ఇతర సెట్‌లను మహారాష్ట్రలోని కర్జాత్ రోడ్డు ఎన్డీ స్టూడియోలో నిర్మించారు. సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఈ సెట్స్ నిలిచాయి. జోధా అక్బర్ తర్వాత కూడా ఈ సెట్స్‌లో ఎన్నో బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల షూటింగ్ కూడా జరిపారు. ఎన్డీ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఈ సెట్టింగ్ పూర్తిగా కాలిపోయినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా అందిన సమాచారం.  ఈ చిత్ర దర్శక, నిర్మాలతో పాటు బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీ వారికి మంచి అనుబధం ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సెట్ అగ్ని ప్రమాదంలో ఆహుతైనందుకు పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.