బైడెన్ 85.. ట్రంప్ 61

ABN , First Publish Date - 2020-11-04T12:54:31+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఇప్పుడు అందరూ ఈ ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బైడెన్ 85.. ట్రంప్ 61

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో ముగిసింది. మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అయితే, పోలింగ్ ముగిసిన కొన్ని రాష్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలి ఫలితాల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ స్వల్ప అధిక్యంలో దూసుకెళ్తున్నారు. ప్రాథమిక ఫలితాల్లో బైడెన్ 8 రాష్ట్రాల్లో విజయం సాధిస్తే... రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయ కేతనం ఎగురవేశారు. ప్రస్తుతం బైడెన్‌కు 85 ఎలక్టోరల్ ఓట్లు దక్కితే.. ట్రంప్‌ 61 ఓట్లు పొందారు. మసాచుసెట్స్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్మంట్, డేలవర్, వర్జినియా, కనెక్టికట్, రోల్ ఐలాండ్‌లో బైడెన్ విజయం సాధించారు. ఇండియానా, కెంటుకీ, ఓక్లహోమా, టేనస్సీ, వెస్ట్ వర్జీనియాల, మిస్సిసీపి, అలబామా, అర్కాన్సాస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. అలాగే టెక్సాస్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంప్‌షైర్‌లలో బైడెన్ అధిక్యంలో ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా సమాచారం. 


Updated Date - 2020-11-04T12:54:31+05:30 IST