మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్

ABN , First Publish Date - 2022-03-19T18:26:55+05:30 IST

ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు పలు కీలక బాధ్యతలు అప్పగించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవికి నామినేట్ చేశారు.

మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్

వాషింగ్టన్: ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు పలు కీలక బాధ్యతలు అప్పగించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవికి నామినేట్ చేశారు. ఇండో-అమెరికన్ దౌత్యవేత్త పునీత్ తల్వార్‌ను మొరాకోకు అమెరికా రాయబారిగా నామినేట్ చేశారు. ప్రస్తుతం స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్న తల్వార్.. వైట్‌హౌస్, సెనేట్‌లో సీనియర్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన పదవులను నిర్వహించారు. అలాగే ఆయన గతంలో రాజకీయ-సైనిక వ్యవహారాల సహాయ కార్యదర్శిగా, అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా, జాతీయ భద్రతా మండలిలో సీనియర్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లోని విదేశీ సంబంధాల కమిటీలో సీనియర్ ప్రొఫెషనల్ స్టాఫ్ సభ్యుడు కూడా. అంతేగాక పబ్లిక్ సర్వీస్‌లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పాలసీ ప్లానింగ్ స్టాఫ్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక తల్వార్ కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్‌లో బీఎస్ డిగ్రీని, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఎంఏ పట్టాను పొందారు. అలాగే ఆయన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అండ్ నేటివ్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ సభ్యుడిగా కూడా ఉన్నారు.

Updated Date - 2022-03-19T18:26:55+05:30 IST