గాల్లో షేక్ హ్యాండ్ ఇచ్చిన బైడెన్.. మొదలైన రచ్చ...

ABN , First Publish Date - 2022-04-16T05:13:59+05:30 IST

మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటుపై పిట్ట రెట్ట వేసినట్టు కనిపించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ఇటీవలే శ్వేత సౌధం క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి బైడెన్ తీరుపై వివరణ ఇచ్చుకునే పరిస్థితి వైట్ హౌస్‌కు వచ్చింది. మళ్లీ ఎందుకు అంటారా.. ? దీనికి కారణం..

గాల్లో షేక్ హ్యాండ్ ఇచ్చిన బైడెన్.. మొదలైన రచ్చ...

ఎన్నారై డెస్క్: మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటుపై పిట్ట రెట్ట వేసినట్టు కనిపించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ఇటీవలే శ్వేత సౌధం క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి బైడెన్ తీరుపై వివరణ ఇచ్చుకునే పరిస్థితి వైట్ హౌస్‌కు వచ్చింది. మళ్లీ ఎందుకు అంటారా.. ? దీనికి కారణం  నెట్టింట్లో గగ్గోలు పుట్టిస్తున్న మరో బైడెన్ వీడియో. నార్త్‌కెరోలినాలోని అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో బైడెన్ ఇటీవల ప్రసంగం చేసిన సందర్భంగా రికార్డు చేసిన వీడియో ఇది. 


తన స్పీచ్ పూర్తయ్యిన తరువాత పోడియం నుంచి కిందకు వెళ్లేందుకు బైడెన్ వెనక్కు తిరుగుతారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఎడవైపు చూస్తూ.. ఎవరికో షేక్ హ్యాండ్ ఇవ్వడానికన్నట్టు చేయి చాస్తారు. వాస్తవానికి అక్కడ ఎవరూ లేరు. దీంతో.. ఈ వీడియో చూసిన వారు బైడెన్ గాల్లో షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఉందని కామెంట్ చేశారు. ఆ తరువాత కూడా  బైడెన్ ఎటు వెళ్లాల్లో తెలీక క్షణకాలం పాటు అలా నిలబడిపోయినట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ తరువాత మళ్లీ తేరుకున్నట్టు కనిపించిన ఆయన.. యథాప్రకారం స్టేజి నుంచి కిందకు దిగి వెళ్లిపోతారు. ఈ వీడియో అమెరికా సెనెటర్ టెడ్ క్రజ్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. అసలేం జరుగుతోందో అర్థం కాక కళ్లు పెద్దవి చేసి చూస్తున్న అర్థం వచ్చే ఓ ఎమోజీని కూడా ఈ వీడియోకు జత చేశారు. దీంతో.. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై వైట్‌హౌస్ ఏం వివరణ ఇస్తుందో తెలియాలంటే ఓ రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే..!



Updated Date - 2022-04-16T05:13:59+05:30 IST