యుద్దం చేస్తోంది వైరస్‌తో.. ఫేస్‌బుక్‌తో కాదు: జో బైడెన్

ABN , First Publish Date - 2021-07-20T15:18:55+05:30 IST

వ్యాక్సిన్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఆపకుండా ఫేస్‌బుక్ సంస్థ మనుషులను చంపుతోందంటూ

యుద్దం చేస్తోంది వైరస్‌తో.. ఫేస్‌బుక్‌తో కాదు: జో బైడెన్

వాషింగ్టన్: వ్యాక్సిన్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఆపకుండా ఫేస్‌బుక్ సంస్థ మనుషులను చంపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు జో బైడెన్ సోమవారం తెలిపారు. ‘‘ఒక 12 మంది ఫేస్‌బుక్ ద్వారా వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని పంపుతున్నట్టు నా ద‌ృష్టికి వచ్చింది. ఈ తప్పుడు సమాచారం మనుషులను చంపుతోంది. వీరి వల్ల మనుషులు చనిపోతున్నారని నేను చెప్పాలనుకున్నాను కాని ఫేస్‌బుక్ మనుషులను చంపుతోందని కాదు. నా వ్యాఖ్యలను ఫేస్‌బుక్ వ్యక్తిగతంగా తీసుకోకుండా వ్యాక్సిన్లపై వస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను’’ అని జో బైడెన్ అన్నారు. తాము యుద్దం చేస్తోంది వైరస్‌తో అని.. ఫేస్‌బుక్‌తో కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. ఇదిలా ఉంటే.. జో బైడెన్ ఇటీవల ఫేస్‌బుక్‌పై చేసిన వ్యాఖ్యలకు కొద్ది గంటల్లోనే ఫేస్‌బుక్ సంస్థ ఘాటుగా స్పందించింది. ఫేస్‌బుక్ మనుషులను చంపడం లేదని, మనుషుల ప్రాణాలను కాపాడుతోందని ప్రకటించింది.  

Updated Date - 2021-07-20T15:18:55+05:30 IST