బెట్టింగ్‌లోనూ బైడెనే ఫేవరేట్ !

ABN , First Publish Date - 2020-11-06T22:39:53+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ ముగిసి రెండు రోజులు గడుస్తున్న ఇంకా ఫలితాలపై స్పష్టత రాకపోవడంతో తదుపరి అధ్యక్షుడు ఎవరనేది చెప్పలేని పరిస్థితి.

బెట్టింగ్‌లోనూ బైడెనే ఫేవరేట్ !

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ ముగిసి రెండు రోజులు గడుస్తున్న ఇంకా ఫలితాలపై స్పష్టత రాకపోవడంతో తదుపరి అధ్యక్షుడు ఎవరనేది చెప్పలేని పరిస్థితి. మిగిలిన ఐదు రాష్ట్రాల ఫలితాలే అమెరికా తరువాతి అధ్యక్షుడిని నిర్ణయించబోతున్నాయి. అయితే, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 264 ఎలక్టోరల్ ఓట్లతో దాదాపుగా అధ్యక్ష పీఠానికి దగ్గరయ్యారనే చెప్పాలి. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్ల దగ్గరే ఆగిపోయారు. ఈ క్రమంలో బెట్టింగ్ మార్కెట్ కూడా బైడెన్‌కు ఫేవర్‌గా జరుగుతోందని సమాచారం. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఏకంగా 87 శాతం మంది బైడెనే గెలుస్తాడని బెట్టింగ్ కాస్తున్నారట. ఈసారి ట్రంప్‌ను ఓడించి బైడెన్ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని వారు నమ్మకంగా చెబుతున్నారట. ప్రముఖ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్ బెట్‌ఫెయిర్ డేటా ప్రకారం 86.7 శాతం మంది బైడెన్‌కు ఫెవర్‌గా బెట్టింగ్ కాస్తున్నట్లు పేర్కొంది.  


ఇక ఫలితాలపై గత రెండు మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు త్వరలోనే తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష పీఠానికి దగ్గరైన బైడెన్.. మిగిలిన ఐదు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఒక్క నెవెడాలోనే అధిక్యంలో ఉన్నారు. అయితే, తాజాగా మరో రాష్ట్రంలో ఆయన ముందంజలోకి వచ్చారు. అదే 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియా. ఇక్కడ ఇప్పటివరకు 99 శాతం కౌంటింగ్ పూర్తిగా కాగా.. బైడెన్ దాదాపు వెయ్యి ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కనుక ఇక్కడ బిడెన్ విజయం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఇక్కడ గెలిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాల ఫలితాలతో సంబంధం బైడెన్ అధ్యక్ష పీఠం అధిరోహిస్తారు.       

Updated Date - 2020-11-06T22:39:53+05:30 IST