ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-03-02T16:09:20+05:30 IST

వాషింగ్టన్: ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

వాషింగ్టన్: ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను రష్యా బలహీనపర్చలేదని, ఉక్రెయిన్‌పై దాడులకు వ్లాదిమిర్ పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. ఉక్రెయిన్‌ను రష్యా ముట్టడించినా.. ప్రజల మనసులు పుతిన్‌ గెలుచుకోలేరన్నారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని జో బైడెన్ అన్నారు.


కాగా బుధవారం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. తొలి విడత చర్చల్లో ప్రాథమిక డిమాండ్లపై ఇరు దేశాలు పట్టు పట్టాయి. తక్షణమే యుద్ధాన్ని విరమించాలని, ప్రత్యేక విధానం ద్వారా తమను ఈయూలో చేర్చాలని ఉక్రెయిన్‌ కోరుతోంది.

Updated Date - 2022-03-02T16:09:20+05:30 IST