పుతిన్‌ ఓ నియంత.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: బైడెన్‌

ABN , First Publish Date - 2022-03-03T13:22:51+05:30 IST

రష్యా అధినేత పుతిన్‌ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు.

పుతిన్‌ ఓ నియంత.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: బైడెన్‌

వాషింగ్టన్‌, మార్చి 2: రష్యా అధినేత పుతిన్‌ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. నియంతలు తమ దూకుడుకు మూల్యం చెల్లించకపోతే మరింత విధ్వంసానికి కారకులవుతారనేది చరిత్ర చెబుతున్న పాఠంగా పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతోనే రష్యా నిష్కారణంగా యుద్ధానికి దిగిందని ఆరోపించారు. పొరుగు దేశంపై దండెత్తినందుకు పుతిన్‌ వంటి నియంతలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగంలో ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-03-03T13:22:51+05:30 IST