Viral video: అయ్యయ్యో.. Joe Biden కు ఇలా జరిగిందేంటి..!

ABN , First Publish Date - 2022-06-19T17:06:14+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) సైకిల్‌ తొక్కుతూ కిందపడిపోయారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

Viral video: అయ్యయ్యో.. Joe Biden కు ఇలా జరిగిందేంటి..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) సైకిల్‌ తొక్కుతూ కిందపడిపోయారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడే ఉన్న కొందరు ఆయన్ను వెంటనే పైకిలేపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి. అసలేం జరిగిందంటే.. డెలావర్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న కేప్‌ హెన్లోపెన్‌ పార్కు‌లో శుక్రవారం అమెరికా ప్రథమ మహిళ, సతీమణి జిల్ బైడెన్‌తో కలిసి అధ్యక్షుడు సైక్లింగ్‌కు వెళ్లారు. కొంతదూరం సైక్లింగ్ చేసిన తర్వాత తనను చూడడానికి వచ్చినవారి కలిసేందుకు బైడెన్ సైకిల్ దిగారు. అనంతరం వారి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు పెడల్‌లో పాదం ఇరుక్కుపోయింది. దాంతో బైడెన్ తూలి, కుడివైపు పడిపోయారు. 


అక్కడే ఉన్న సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే ఆయనకు చేయి అందించి పైకిలేపారు. పైకి లేచిన అధ్యక్షుడు బైడెన్​ 'ఐయామ్‌ గుడ్‌' అని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో బైడెన్‌కు ఎలాంటి గాయం కాలేదు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనను అధ్యక్షభవనం శ్వేతసౌధం (White House) సైతం ధృవీకరించింది. అధ్యక్షుడికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన పూర్తి సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది.





Updated Date - 2022-06-19T17:06:14+05:30 IST