భారతీయ అమెరికన్లకు బైడెన్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్!

ABN , First Publish Date - 2021-04-14T15:39:35+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశంలోని భారతీయ-అమెరికన్లు, దక్షిణ ఆసియన్లు, ఆగ్నేయాసియన్లు ఎవరైతే నూతన సంవత్సరం జరుపుకుంటున్నారో వారికి మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

భారతీయ అమెరికన్లకు బైడెన్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశంలోని భారతీయ-అమెరికన్లు, దక్షిణ ఆసియన్లు, ఆగ్నేయాసియన్లు ఎవరైతే నూతన సంవత్సరం జరుపుకుంటున్నారో వారికి మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. "ఈ వారం వైశాఖి, నవరాత్రి, సాంగ్‌క్రాన్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా వాసులకు నేను, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హ్యాపీ బెంగాలీ, కంబోడియాన్, లావో, మయన్మారీస్, నేపాలీ, సింహళీస్, తమిళం, థాయ్, విషు న్యూ ఇయర్!" అని బైడెన్ మంగళవారం ట్వీట్ చేశారు. అలాగే బైసాఖి సందర్భంగా కొంతమంది చట్టసభ సభ్యులతో కలిసి అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్‌లేడీ జిల్ బైడెన్ భారతీయ-అమెరికన్లు, సిక్కులను పలకరించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. "దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజానికి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వైశాఖి శుభాకాంక్షలు!" అని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా అన్నారు. అలాగే మరో ఇండో-అమెరికన్ చట్టసభ్యుడు రో ఖన్నా కూడా ట్వీటర్ వేదికగా సిక్కు కమ్యూనిటీకి వైశాఖి విషెస్ తెలియజేశారు. ఇల్లినాయిస్ సెనేటర్ డిక్ డర్బిన్ కూడా సిక్కులు, సిక్కు అమెరికన్లకు వైశాఖి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-04-14T15:39:35+05:30 IST