అబ్రహాం లింకన్ తర్వాత నేనే... ఫైనల్ డిబేట్‌లో ట్రంప్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-23T17:21:42+05:30 IST

‘ఈ గదిలో.. ఇక్కడ ఉన్నవారిలో అత్యంత తక్కువ జాత్యాహంకారం ఉన్న వ్యక్తిని నేనే.. నల్ల జాతీయులకు నేనే చేసినంత సేవ ఇంతవరకు ఏ అధ్యక్షుడూ చేయలేదు.. అప్పట్లో అబ్రహాం లింకన్ నల్లజాతీయుల ఉన్నతికి దోహదం చేశారు.. ఆయన తర్వాత వారి అభ్యున్నతికి నేనే ఎక్కువ కృషి చేశా..’.. అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అబ్రహాం లింకన్ తర్వాత నేనే... ఫైనల్ డిబేట్‌లో ట్రంప్ వ్యాఖ్యలు

వాషింగ్టన్: ‘ఈ గదిలో.. ఇక్కడ ఉన్నవారిలో అత్యంత తక్కువ జాత్యాహంకారం ఉన్న వ్యక్తిని నేనే.. నల్ల జాతీయులకు నేనే చేసినంత సేవ ఇంతవరకు ఏ అధ్యక్షుడూ చేయలేదు.. అప్పట్లో అబ్రహాం లింకన్ నల్లజాతీయుల ఉన్నతికి దోహదం చేశారు.. ఆయన తర్వాత వారి అభ్యున్నతికి నేనే ఎక్కువ కృషి చేశా..’.. అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో గురువారం రాత్రి జరిగిన ఫైనల్ డిబేట్‌లో ఆయన ప్రసంగించారు. ఓ నల్లజాతీయురాలైన మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ట్రంప్ కామెంట్స్‌పై జో బైడెన్ వెరైటీగా స్పందించారు. తనను తాను దివంగత మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌తో ట్రంప్ పోల్చుకోవడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. ‘అత్యంత ప్రమాదకర జాత్యాహంకారిగా అబ్రహాం లింకన్‌ను ఆధునిక అమెరికా సమాజం చూస్తోంది.. ప్రతి అమెరికన్ పౌరుడిలో జాత్యాహంకార భావాలను ఆయన రెచ్చగొట్టారు..’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ట్రంప్ వెంటనే రియాక్టయ్యారు.. ‘అబ్రహాం లింకన్ జాత్యాహంకారి అనడానికి మీ వద్ద సాక్ష్యాలున్నాయా..? ఏ ఆధారాలను బట్టి మీరు ఈ విపరీత కామెంట్స్ చేశారు. దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది..’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బైడెన్ చాలా కూల్‌గా ‘నేను ఆధునిక అబ్రహం లింకన్‌ను అని నువ్వే కదా చెప్పుకున్నావు..’ అంటూ ట్రంప్‌పై వ్యంగాస్త్రం సంధించారు. దీనికి ట్రంప్ కాస్త తడబడుతూ.. ‘నో.. నో... నేను అబ్రహం లింకన్‌ను అని అనలేదు.. అబ్రహం లింకన్ తర్వాత.. నల్లజాతీయులైన అమెరికన్లకు నేను చేసినంత సేవ.. గత అమెరికన్ అధ్యక్షులెవరూ చేయలేదు.. అని మాత్రమే అన్నాను..’ అని వివరణ ఇచ్చుకున్నారు. 

Updated Date - 2020-10-23T17:21:42+05:30 IST