మళ్లీ పొరబడ్డ బైడెన్.. సోషల్ మీడియాలో ఒకటే హల్‌చల్.. !

ABN , First Publish Date - 2022-03-18T03:22:28+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మైక్ ముందుకొస్తే చాలు.. చిన్న చిన్న పొరపాట్లకు పాల్పడుతూ నవ్వులు తెప్పిస్తుంటారు. తాజాగా కమలా హారిస్ విషయంలో మళ్లీ నోరు జారి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

మళ్లీ పొరబడ్డ బైడెన్.. సోషల్ మీడియాలో ఒకటే హల్‌చల్.. !

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మైక్ ముందుకొస్తే చాలు.. చిన్న చిన్న పొరపాట్లకు పాల్పడుతూ నవ్వులు తెప్పిస్తుంటారు. తాజాగా కమలా హారిస్ విషయంలో మళ్లీ నోరు జారి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన ఓ పత్రికా సమావేశంలో పాల్గొన్న బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్తకు కరోనా సోకిందన్న విషయాన్ని చెప్పారు. అయితే.. ఈ విషయాన్ని నేరుగా చెప్పే బదులు ప్రథమ మహిళ భర్తకు కరోనా సోకిందని చెప్పారు. దీంతో.. ఆ సమావేశ మందిరంలో అందరూ ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వారు.


 ప్రథమ మహిళ అంటే అధ్యక్షుడి భార్య. ఇక కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అన్న విషయం తెలిసిందే. ఆమె భర్తను సెకెండ్ జంటిల్మెన్ అని పిలుస్తుంటారు. జరిగిన పొరపాటును వెంటనే గుర్తించిన బైడెన్.. అక్కడున్న వారితో పాటూ తనూ నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. నాటి సమావేశంలో పలుమార్లు బైడెన్ ఇలాగే తడబడ్డారంటూ నెటిజన్లు చెబుతున్నారు. కమలా హారిస్ భర్తను సెకెండ్ లేడీ అని ఒకసారి, ఫస్ట్ జెంటిల్మెన్ అని మరోసారి పిలిచినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-03-18T03:22:28+05:30 IST