ట్రంపునకు ఆ రహస్యం చెప్పడం వెస్ట్.. పైగా దేశానికే ప్రమాదం: బైడెన్

ABN , First Publish Date - 2021-02-06T18:38:09+05:30 IST

మాజీ అధ్యక్షులకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలను చెప్పడం అమెరికాలో ఆనవాయితీగా వస్తుంది.

ట్రంపునకు ఆ రహస్యం చెప్పడం వెస్ట్.. పైగా దేశానికే ప్రమాదం: బైడెన్

వాషింగ్టన్: మాజీ అధ్యక్షులకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలను చెప్పడం అమెరికాలో ఆనవాయితీగా వస్తుంది. అయితే, ట్రంప్ విషయంలో అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయానికి స్వస్తి పలకబోతున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ట్రంపునకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం చెప్పడం వల్ల ఒరిగేదేమి లేదని.. నోరుజారే అతని వ్యక్తిత్వం వల్ల.. అది దేశానికే ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ బైడెన్ అన్నారు. అందుకే  ట్రంపునకు ఆ రహస్య విషయాలు చెప్పబోమని అధ్యక్షుడు ఖరాకండిగా చెప్పేశారు. 


"ఆయనకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం అందజేయడం అనవసరమని నా అభిప్రాయం. కీలక విషయాలు చెప్పడం వల్ల ఒరిగేదేమి లేదు. పైగా నోరుజారే ఆయనకు రహస్య విషయాలు చెప్పడం అంత శ్రేయస్కరం కూడా కాదు. నోరుజారీ ఎక్కడైన వాగితే.. అది దేశ భద్రతకే ప్రమాదం" అని బైడెన్ చెప్పుకొచ్చారు. అలాగే యూఎస్ ప్రత్యర్థి దేశాల్లో ట్రంపునకు భారీగా వ్యాపారాలు ఉన్నాయని.. వాటి నుంచి లబ్ధి పొందేందుకు దేశ భద్రత సమాచారాన్ని ట్రంప్ లీక్ చేసే అవకాశం ఉందని మాజీ జాతీయ భద్రతాధికారి ఒకరు బైడెన్‌కు చెప్పినట్లు సమాచారం. అందుకే విపరీత వ్యక్తిత్వం, దుందుడుకు స్వభావం గల ట్రంపునకు ఎట్టిపరిస్థితుల్లో దేశ భద్రత సమాచారాన్ని అందజేయబోమని బైడెన్ స్పష్టం చేశారు. అయితే, మాజీ అధ్యక్షులకు ఇలా దేశ భద్రత సమాచారం అందించడం వల్ల.. భవిష్యత్తులో వారి అనుభవం ఉపయోగపడే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఈ ఆనవాయితీని కొనసాగిస్తుంది. అధ్యక్షుడి సమ్మతితోనే ఇది జరుగుతుంది.      

Updated Date - 2021-02-06T18:38:09+05:30 IST