Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరుకానున్న జో బైడెన్

ABN , First Publish Date - 2022-09-10T17:06:33+05:30 IST

బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియల

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరుకానున్న జో బైడెన్

వాషింగ్టన్ : బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) హాజరుకానున్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు వివరాలు ఇంకా తెలియదని, అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. తాను కింగ్ ఛార్లెస్-3 (King Charles III)తో మాట్లాడలేదని తెలిపారు. 


క్వీన్ అంత్యక్రియలు జరిగే తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ నెల 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఈ కార్యక్రమం జరుగుతుందని బ్రిటిష్ మీడియా చెప్తోంది. 


ఈ నేపథ్యంలో బైడెన్  మీడియాతో మాట్లాడుతూ, తనకు వివరాలు ఇంకా తెలియదని, తనకు కింగ్ ఛార్లెస్-3 (King Charles III)తో పరిచయం ఉందని, ఆయనతో తాను ఇంకా మాట్లాడలేదని తెలిపారు. అయితే తాను క్వీన్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు.


Updated Date - 2022-09-10T17:06:33+05:30 IST