పుతిన్‌ పతనానికి జాన్సన్‌ ఆరు సూత్రాలు!

ABN , First Publish Date - 2022-03-07T09:21:22+05:30 IST

పుతిన్‌ పతనానికి జాన్సన్‌ ఆరు సూత్రాలు!

పుతిన్‌ పతనానికి జాన్సన్‌ ఆరు సూత్రాలు!

ప్రపంచానికి యూకే ప్రధాని ప్రతిపాదన



లండన్‌, మార్చి 6: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. పుతిన్‌ ఓటమికి ఆరు ప్రతిపాదనలతో ముందుకొచ్చారు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. ప్రస్తుత పరిణామాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయన, ఈ మేరకు ప్రణాళికలను ప్రపంచ దేశాల నేతల ముందుంచనున్నారు. తమపై పశ్చిమ దేశాలు ఆంక్షల విధింపు యుద్ధంతో సమానమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన మరుసటి రోజే.. బ్రిటన్‌ ప్రధాని ఈ మేరకు చొరవ చూపడం గమనార్హం. కాగా, జాన్సన్‌ వెల్లడించిన ఆరు సూత్రాల ప్రణాళికలో.. ఉక్రెయిన్‌ రక్షణ కోసం అంతర్జాతీయంగా మానవతా సంకీర్ణం ఏర్పాటు, ఆత్మరక్షణకు ఆ దేశ సైన్యానికి ఊతమివ్వడం, ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా రష్యాను ఉక్కిరిబిక్కిరి చేయడం, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడం, యూరో-అట్లాంటిక్‌ భద్రత మరింత బలోపేతం, రష్యా షాక్‌ నుంచి ఉక్రెయిన్లను సాధారణ స్థితికి తీసుకురావడం అంశాలుగా ఉన్నాయి. కాగా, రష్యాపై దౌత్య ఒత్తిడిని పెంచే దిశగా కలిసిరావాలని భారత్‌, చైనాకు బ్రిటన్‌ పిలుపునిచ్చింది. 


Updated Date - 2022-03-07T09:21:22+05:30 IST