ఎయిడ్స్‌ రహిత జిల్లాగా నిలుపుదాం

ABN , First Publish Date - 2021-12-02T05:39:18+05:30 IST

‘ఎయిడ్స్‌ అంతమే మన పంతంగా ముందుకు సాగాల’ని జేసీ డాక్టర్‌ సిరి పిలుపునిచ్చారు.

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా నిలుపుదాం

జేసీ డాక్టర్‌ సిరి పిలుపు

అనంతపురం వైద్యం, డిసెంబరు 1: ‘ఎయిడ్స్‌ అంతమే మన పంతంగా ముందుకు సాగాల’ని జేసీ డాక్టర్‌ సిరి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాలను జిల్లా వైద్యశాఖ బుధవారం ఘనంగా నిర్వహించింది. తొలుత జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల వ ద్ద భారీ ర్యాలీని జేసీ జెండా ఊపి, ప్రారంభించారు. సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఎ యిడ్స్‌ నియంత్రణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఉచితంగా పరీక్షలు, మందులు అందజేస్తున్నాయన్నారు. ఇది అంటు వ్యాధి కాదనీ, బాధితుల పట్ల వివక్ష చూపరాదని సూచించారు. ఎయిడ్స్‌పై మరింత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యశాఖకు ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కరరెడ్డి, వాసంతి సాహిత్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ పాల్గొన్నారు. స్థానిక ఐఎంఏ హాల్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హెచఐవీ బాధిత కుటుంబాలకు న్యూట్రీషన పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథం, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ రామసుబ్బారావు, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ హేమలత, డాక్టర్‌ సుజాత, ఆర్డీటీ హెల్త్‌ డైరెక్టర్‌ శిరప్ప, ఎయిడ్స్‌ విభాగ డీపీఎంలు వెంకటరత్నం, రమణ, డెమోలు ఉమాపతి, గంగాధర్‌, వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T05:39:18+05:30 IST