ఉమ్మడి పోరాట కార్యాచరణ

ABN , First Publish Date - 2021-03-09T05:57:47+05:30 IST

ఉమ్మడి పోరాట కార్యాచరణ

ఉమ్మడి పోరాట కార్యాచరణ

  • టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య

ఆమనగల్లు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించకుంటే అన్ని శాఖాల ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఉమ్మడి పోరాట కార్యాచరణ రూపొందిస్తామని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య అన్నారు. మూడేళ్లుగా ప్రభత్వం పీఆర్‌సీ ప్రకటించడం లేదన్నారు. సోమవారం ఆమనగల్లులోని ప్రమీలమ్మ కళాశాలలో ఫెడరేషన్‌ ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాల సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ ప్రకటించిన ఉద్యోగ విరమణ వయసును 60ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల్లో వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నాగేంద్రం, భగవంత్‌ రాజు, జిల్లా ఆడిట్‌ కమిటీ బి.రాములయ్య, మండలాల బాధ్యులు ఆంజనేయులు, శ్రీనివా్‌సరావు, సురేష్‌, ఆంజనేయులు, నర్సింహ, మధుసూదనచారి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:57:47+05:30 IST