Advertisement

బిల్‌బోర్డ్‌ అవార్డ్స్‌ రేసులో జోనస్‌ బ్రదర్స్‌.. అభినందనలు చెప్పిన ప్రియాంక

Sep 23 2020 @ 10:58AM

2020లో బిల్‌బోర్డ్ మ్యూజిక్‌ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ అవార్డ్స్‌ వేడుక అక్టోబర్‌ 14న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. ఈ నామినేషన్స్‌లో మన ప్రియాంక భర్త నిక్‌ జోనస్‌, ఆయన సోదరుల బృందం నామినేషన్స్‌లో పోటీ పడుతుంది. 55 కేటగిరీల్లో టాప్‌ ఆర్టిస్ట్‌, టాప్‌ డ్యూయొ/గ్రూప్‌, టాప్‌ రేడియో సాంగ్‌ ఆర్టిస్ట్‌, టాప్‌ రేడియో సాంగ్‌ విభాగాల్లో జోనస్‌ బ్రదర్స్‌ నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై నిక్‌ జోనస్‌ భార్య, బాలీవుడ్‌, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. వారికి అభినందనలు తెలిపారు. మరి జోనస్‌ బ్రదర్స్‌ నామినేషన్స్‌కే పరిమితమవుతారా? లేక విజేతలుగా కూడా నిలుస్తారనేది చూడాలి. ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ అవార్డుల కార్యక్రమం కోవిడ్‌ ప్రభావంతో అక్టోబర్‌కి వాయిదా పడింది. మరి నిర్వాహకులు ఈ వేడుకలను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 


Advertisement
Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.