యూట్యూబ్‌: జోన్స్‌ వెడ్స్‌ జాయిస్‌!

May 9 2021 @ 00:38AM

యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌, ‘ఓవర్‌నైట్‌ స్టార్‌’, ‘యాంగ్రీ బర్డ్‌’, ‘బ్రోకన్‌’, ‘తిండిబోతు గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి ఎపిసోడ్స్‌తో ఆకట్టుకున్న జోన్స్‌ కాట్రు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి జాయిస్‌ తాళ్లూరిని వివాహమాడారు. వైజాగ్‌కి చెందిన జోన్స్‌ తమడ మీడియాలో కొన్నేళ్లగా కంటెంట్‌ క్రియేటర్‌గా, దర్శకుడిగా, ఆర్టిస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ కొనసాగిస్తున్నారు. ఆయన నటించే ప్రతి ఎపిసోడ్‌లోనూ తనకు జోడీగా నటించే గోల్డీతో ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. అయితే జోన్స్‌ ఆ వదంతుల్ని ఖండించారు. ఆన్‌ స్ర్కీన్‌ మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా పండడం వల్ల చాలామంది అలాగే పొరపాటు పడ్డారని గతంలో ఆయన ‘చిత్రజ్యోతి’కి తెలిపారు. తన స్నేహితురాలు జాయిస్‌తో కొన్నాళ్లగా ప్రేమలో ఉన్న ఆయన ఎట్టకేలకు వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకలో శోభన్‌, గోల్డీ, సాయి సోమయాజులు, జైయత్రి తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.