టీఆర్‌ఎస్‌లో జోష్‌!

ABN , First Publish Date - 2020-10-11T09:59:25+05:30 IST

మ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించగానే అధికార..

టీఆర్‌ఎస్‌లో జోష్‌!

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంతో ఉమ్మడి జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణలు

టీఆర్‌ఎస్‌లో కవిత ఆధ్వర్యంలో మళ్లీ ఊపందుకోనున్న కార్యక్రమాలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను వరించనున్న మరో రాష్ట్రస్థాయి పదవి

ఈనెల 14న ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం చేసే ఛాన్స్‌!


నిజామాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించగానే అధికార టీఆర్‌ఎస్‌ పా ర్టీలో సమీకరణలు మారనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ కార్యక్రమాలకు మళ్లీ పూర్వపు జోష్‌ రానుంది. ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా ఉన్న సమీకరణలు ఇక మారనున్నాయి. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక వుతుండడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా కీలకంగా మారనుంది. నిజామాబాద్‌కు రాష్ట్రస్థాయిలో మరో పదవి రానుంది.


ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక లాంఛనమే! పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఆ మెకు భారీ మెజారిటీ రానుంది. ఆమె గెలుపుతో ఉమ్మడి జి ల్లా పరిధిలోని కేడర్‌లో మరింత జోష్‌ రానుంది. ఇన్నాళ్లు స్త బ్ధుగా ఉన్న ఆమె వర్గీయులు ఇప్పుడు ఆక్టీవ్‌ కానున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత సంవత్సర కాలానికిపైగా రాజకీయా లకు దూరంగా ఉన్న ఆమె ఈ ఫలితంతో పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాపై దృష్టి పెట్టనున్నారు. తొమ్మిది నియోజకవ ర్గాల పరిధిలో ఆమె పనిచేసే అవకాశం ఉంది. ఎంపీగా ఉ న్న సమయంలో కేవలం నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల పరిధిలోనే ఆమె పనిచేశారు. ఇకమీదట కామారెడ్డి జిల్లా వారికి సైతం ఆమె అందుబాటులో ఉండనున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నారు. 


సంవత్సర కాలానికిపైగా విరామం తర్వాత ఎమ్మెల్సీగా ఎ న్నికవుతున్న కల్వకుంట్ల కవిత ఉమ్మడి జిల్లాపై దృష్టి పెట్ట్ట నున్నారు. ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమా లలో పాలు పంచుకోవడంతో పాటు ప్రజలకు అందుబాటు లో ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యక్ర మాలను మరింత సమర్ధవంతంగా తీసుకుపోనున్నారు. కేడ ర్‌కు అందుబాటులో ఉండడంతో పాటు పనులు కూడా అ దే రీతిలో చేయనున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులను తీసుకువచ్చారు. ప్రస్తు తం ఎమ్మెల్సీగా కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో అదే రీతిలో తీసుకువచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు మళ్లీ అందుబాటులోకి రానున్నా రు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పార్టీ సమీకరణలు కూడా కొం త మారనున్నాయి. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల కు పరిమితమైన కార్యక్రమాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగనున్నాయి.


ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న కవితకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి వస్తుందని ఉమ్మడి జిల్లాలోని పార్టీ నేతలలో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వానికి అండగా ఉంటూ చక్రం తిప్పిన కవిత.. రాష్ట్రంలో కూడా అదే రీతిలో పనిచేస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ కీలక పద వి వస్తుందని జిల్లా నేతలు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న ఆమెకు కీలక పదవి వస్తే మేలు జరుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడు తున్నారు. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత పదవిపై క్లారిటీ వస్తు ందని వారు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధి లో టీఆర్‌ఎస్‌ శ్రేణులలో ఉత్సాహం కనిపిస్తోంది.


14న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న కల్వకుంట్ల కవిత ఈనెల 14వ తేదీన మండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసే అవకా శం ఉంది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండ డంతో.. అదే రోజు ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతల సమాచారం బట్టి తెలుస్తోంది. సమయం అను కూలించక పోతే 15న చేయనున్నారు. ఆమె ప్రమాణ స్వీకా రం రోజున ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, సీనియ ర్‌ నేతలు హైదరాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంది.


రెండు రౌండ్లు.. రెండు గంటలు

రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు  

కౌంటింగ్‌ కోసం ఆరు టేబుళ్ల ఏర్పాటు 

రెండు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి 

ఆరోవంతు ఓట్లు వస్తేనే డిపాజిట్‌

ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణను పూర్తి చేసిన అధికారులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగియడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం రెండు రౌండ్లు.. అదీ రెండు గంటలలోనే ఫలితాలను ప్రకటిం చే విధంగా చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌కు అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు మినహా ఎవరినీ అనుమతించడం లేదు. 


ఎమ్మెల్సీ ఉప ఎన్నిక  ఓట్ల లెక్కింపు సోమవారం జరగ నుంది. నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో జరగనున్న ఓట్ల కోసం లెక్కింపు అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ ఎలా చేయాలో వారికి వివరించారు. కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. మొత్తం ఆరు టేబుళ్లను కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతీ టేబుల్‌కు నలుగురు సిబ్బందిని నియమించారు. రెండు రౌండ్లలో ఈ కౌంటిం గ్‌ను పూర్తి చేయనున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కి స్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రిటర్నింగ్‌ అధికారి ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అభ్యర్థి గెలిచినట్లు ధ్రు వీకరణ పత్రాన్ని అందిస్తారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 824 ఓట్లు ఉన్నాయి. వీటిలో 823మంది ఓటు వేశారు. ఒక ఓటరు గత నెలలో మృతి చెందాడు. మొత్తం వంద శాతం పోలింగ్‌ జరిగింది.


ఓటు వేసిన వారిలో 821 మంది పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయగా.. ఇద్దరు కరోనా కారణంగా పో స్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. ఈ ఉప ఎన్నికలో ఓట్లు తక్కువగా ఉండడం వల్ల రెండు గంటలలోపే ఫలితాన్ని ప్రక టించే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో ఆరోవంతు వస్తేనే పోటీలో ఉన్న అభ్యర్థికి డిపాజిట్‌ వస్తుం ది. ఎన్నికల నిబంధనల ప్రకారం గెలిచే అభ్యర్థి మినహాయి స్తే.. పోటీలో ఉన్న ఒక్కొక్కరికి 138ఓట్లు రావాలి. అప్పుడే వా రికి డిపాజిట్‌ వస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పాలిటె క్నిక్‌ కళాశాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్‌లోని స్ట్రాంగ్‌ రూంలో బ్యాలెట్‌ బాక్సులను భద్రప ర్చడంతో బందోబస్తును కట్టుదిట్టం చేశారు.  


ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా పాలిటెక్నిక్‌ కళాశాల లో శనివారం స్ర్కూట్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎ న్నికల పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వీరబ్రహ్మ య్య, రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయ ణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో రవి, ఏవో సుదర్శ న్‌, పోలింగ్‌ ఏజెంట్లు పాల్గొన్నారు. పోలింగ్‌ కేంద్రాల ఆధా రంగా స్ర్కూట్నీ చేశారు. కౌంటింగ్‌ జరిగే విధానాన్ని సిబ్బం దితో పాటు ఏజెంట్లకు వివరించారు. ఓట్ల లెక్కింపు ఉద యం 8గంటలకు మొదలవుతుందని రిటర్నింగ్‌ అధికారి, ని జామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు ఏడు గంటలకే కౌంటింగ్‌ కేంద్రానికి చేరు కోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-10-11T09:59:25+05:30 IST