కిడ్నీ వ్యాధితో జర్నలిస్ట్ పోరాటం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-03-04T12:14:37+05:30 IST

జర్నలిస్ట్‌ జునైద్‌ ముల్తాన్‌ కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో త్రీవ అనారోగ్యానికి గురై ఆర్థిక

కిడ్నీ వ్యాధితో జర్నలిస్ట్ పోరాటం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

హైదరాబాద్‌ : జర్నలిస్ట్‌ జునైద్‌ ముల్తాన్‌ కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో త్రీవ అనారోగ్యానికి గురై ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఫలక్‌నుమా జంగమ్మెట్‌ ప్రాంతానికి చెందిన జునైద్‌ బీపీ పెరిగి అస్వస్థతకు గురి కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కిడ్నీలు 80 శాతానికి పైగా చెడిపోయాయని చెప్పారు. వెంటనే డయాలిసిస్‌తోపాటు, కిడ్నీ మార్పిడి  చేయాలని వైద్యులు స్పష్టం చేశారు. బంధువులు, స్నేహితుల సాయంతో ఇప్పటి వరకు రూ. 4 లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నాలుగు నెలలుగా ఇంటి వద్దే ప్రాథమిక చికిత్సతో జీవనం సాగిస్తున్నాడు.


రోజూ రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వైద్యానికి ఖర్చు చేయడం భారంగా మారిందని జునైద్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కిడ్నీ మార్పిడి కాకుండా, వైద్య ఖర్చులకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్ష ల వరకు ఖర్చు అవుతుందని జునైద్‌ తెలిపాడు. దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని జునైద్‌, అతడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావులను ట్వీటర్‌లో వేడుకున్నారు. జునైద్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. సాయం చేసే దాతలు గూగుల్‌పే 93917 49783 చేయవచ్చు. 

Updated Date - 2021-03-04T12:14:37+05:30 IST