ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్స్‪కి అవకాశం ఇచ్చిన ఏకైక హీరో Jr NTR

Published: Fri, 20 May 2022 20:44:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్స్‪కి అవకాశం ఇచ్చిన ఏకైక హీరో Jr NTR

ఎన్టీఆర్ (NTR)... 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఏకైక ఇండియన్ హీరో. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఈ హీరో, కెరియర్ పీక్ స్టేజ్‪లో ఉండగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. కసితో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడానికి ఎన్టీఆర్‪కి అయిదేళ్ళు పట్టింది. ఫ్లాప్స్‪లో ఉన్న వ్యక్తి కసి ఎలా ఉంటుందో తెలిసిన హీరో ఎన్టీఆర్.  అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్స్‪కి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్స్‪లో స్టార్ డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం.


ఈ ఫ్లాప్ నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన దర్శకుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాధ్ (Puri Jagannadh) గురించి. పూరి- ఎన్టీఆర్ (Puri-NTR) ఇద్దరూ ఫ్లాప్స్‪లో ఉన్న టైంలో... ఇద్దరూ కలిసి ‘టెంపర్’ (Temper) మూవీ చేశారు. ఇది తారక్ (Tarak), పూరిలకి కంబ్యాక్ ఫిల్మ్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) కూడా హిట్ అయ్యింది. ఈ మూవీ డైరెక్టర్ అయిన సుకుమార్ (Sukumar), అంతకు ముందు చేసింది ఫ్లాప్ సినిమానే. 

ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్స్‪కి అవకాశం ఇచ్చిన ఏకైక హీరో Jr NTR

ఇక కెరియర్ పీక్ స్టేజ్‪లో ఉండగా ఎన్టీఆర్ వేసిన డేరింగ్ స్టెప్ బాబీ (Bobby)తో సినిమా చేయడం. అసలే కొత్త దర్శకుడు, పైగా డిజాస్టర్ ఇచ్చాడు. అలాంటి డైరెక్టర్‪తో ఏ హీరో అయినా సినిమా చేయాలి అంటే భయపడతాడు.. కానీ ఎన్టీఆర్ ఏకంగా ట్రిపుల్ రోల్ ప్లే చేస్తూ ‘జై లవ కుశ’ (Jai Lava Kusa) సినిమా చేశాడు. ఇందులో జై క్యారెక్టర్... టాలీవుడ్స్ బెస్ట్ హీరో క్యారెక్టర్స్‪లో ఒకటి. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ (NTR - Trivikram) కాంబినేషన్ కోసం నందమూరి ఫాన్స్ (Nandamuri Fans) ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది అనుకునే లోపు త్రివిక్రమ్ భారీ ఫ్లాప్ ఇచ్చాడు. ఈ టైములో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనుకున్నారు కానీ.. తారక్ డేర్ చేసి ‘అరవింద సమేత’ (Aravinda Sametha) సినిమా పూర్తి చేసి హిట్ కొట్టాడు. ఈ మూవీలో హీరో ఇంట్రడక్షన్ సీన్, చాలా మంది హీరోలకి డ్రీం ఇంట్రడక్షన్ లాంటిది. 


ఇక పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్‪గా, రాజమౌళి లేకుండా ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కొరటాల శివ (Koratala Siva)తో. శివ కమర్షియల్ హిట్స్‪కి కేరాఫ్ అడ్రెస్. ఈ కాంబినేషన్ పక్కా పాన్ ఇండియా హిట్ ఇస్తారు అనుకునే టైంకి కొరటాల టాలీవుడ్‪లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఆ ఫ్లాప్ చూసి ‘ఎన్టీఆర్ 30’ డైరెక్టర్ తప్పకుండా మారిపోతాడు అని అంతా అనుకున్నారు కానీ.. ఎన్టీఆర్ డైరెక్టర్‪ని మార్చలేదు. పూరి, సుకుమార్, బాబీ, త్రివిక్రమ్‪లని ఎలా నమ్మాడో... ఈసారి కొరటాల శివని కూడా అలానే నమ్మాడు. కొరటాల వీకెస్ట్ టైంలో ఎన్టీఆర్ అతనికి అండగా నిలిచాడు. దాని అవుట్‪పుట్ ఎలా ఉండబోతుందో.. ‘ఎన్టీఆర్ 30’ రిజల్ట్ చెప్పబోతోంది. ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి ‘NTR30’ మోషన్ పోస్టర్ జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International