జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్‌

Published: Fri, 18 Mar 2022 18:55:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మీర్జా, అతని కుమారుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరిట స్టిక్కర్‌ ఉంది. రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-1 వైపు మహీంద్రా కారు వెళ్లింది. తిరిగి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొట్టింది. ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.