TS News: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో విచారణ పూర్తి... చార్జ్‌షీట్ దాఖలుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-07-26T19:31:49+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు రంగం సిద్ధమైంది.

TS News: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో విచారణ పూర్తి... చార్జ్‌షీట్ దాఖలుకు రంగం సిద్ధం

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్(Jubilee hills minor rape) కేసులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు రంగం సిద్ధమైంది. నేరం నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను పోలీసులు ఇప్పటికే  సేకరించారు. దాదాపు 400 పేజీల చార్జిషీట్‌ను సిద్ధం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్(FSL) నివేదిక, సీసీ పుటేజ్, కాల్ సిడిఆర్ కీలకం కానుంది. పక్కా ఆధారాలతో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. మే28న ఘటన  జరుగగా... మే31న కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్ధీన్ మాలిక్ సహా నలుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల్లోనే అధికారులు విచారణను పూర్తి చేశారు. 


Updated Date - 2022-07-26T19:31:49+05:30 IST