హైదరాబాద్ : జూబ్లీహిల్స్(Jubleehills) అత్యాచార ఘటనపై కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితులు బెయిల్(Bail) కోసం పిటిషన్ దాఖలు చేశారు. జువెనైల్ జస్టిస్ బోర్డులో ఐదుగురు నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు(Namapally Court)లో సాదుద్దీన్ మాలిక్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. పోలీస్ కస్టడీ పూర్తి అయినందున బెయిల్ ఇవ్వాలని నిందితుల తరుపు న్యాయవాది కోరారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. మరికాసేపట్లో జువెనైల్ జస్టిస్ బోర్డ్, నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించనున్నాయి.