నూతన ప్రధాన న్యాయమూర్తిగా భూపతి
ఖమ్మంలీగల్, డిసెంబరు 2: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మణ్ బదిలీ అయ్యారు. ఆయనను ప్రభుత్వం లేబర్ కోర్టు-1 హైదరాబాద్‌కు బదిలీచేసింది. ఆయన స్థానంలో అడిషనల్ డైరెక్టర్ స్టేట్ జ్యుడిషియల్ అకాడమి సికింద్రాబాద్‌లో పనిచేస్తున్న సీహెచ్‌కే భూపతిని నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కాగా లక్ష్మణ్ 2016 డిసెంబరు నుంచి ఖమ్మం జిల్లా న్యాయమూర్తిగా పనిచేశారు.