జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీలు

ABN , First Publish Date - 2021-07-25T05:11:09+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న పలువురు జూనియర్‌ సివిల్‌జడ్జిలను బదిలీచేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.

జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీలు

గుంటూరు (లీగల్‌), జూలై 24: జిల్లాలో పనిచేస్తున్న పలువురు జూనియర్‌ సివిల్‌జడ్జిలను బదిలీచేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎస్‌పీడీ వెన్నెలను తిరుపతిలోని 3వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీచేశారు. ఆమె స్థానంలో సత్తెనపల్లి 1వ అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జిగా పనిచేస్తున్న సయ్యద్‌ జియావుద్దీనను నియమించారు. ఆయన స్థానంలో కాకినాడలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎం.ప్రశాంతిని నియమించారు. గుంటూరు 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న కేవీ రామకృష్ణను అనంతపురం జిల్లా గుంతకల్లు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీచేసి, ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో జూనియర్‌ సివిల్‌జడ్జిగా పనిచేస్తున్న జి.స్వాతిని నియమించారు. గుంటూరు 4వ అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి ఎస్‌.అరుణశ్రీని చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జిగా బదిలీ చేశారు. తదుపరి నియామకం జరిగే వరకు 6వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఈ కోర్టుకు ఇనచార్జ్‌గా వ్యవహరిస్తారు. గుంటూరు 5వ అదనపు సివిల్‌ జడ్జి బి.రాధారాణిని మైదుకూరు జూనియర్‌ సివిల్‌జడ్జిగా బదిలీచేసి, ఆమె స్థానంలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జూనియర్‌ సివిల్‌ జడ్జి పొన్నూరు బుజ్జిని నియమించారు. నరసరావుపేట ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జిగా బదిలీ చేశారు. ఖాళీ అయిన ఆ కోర్టు బాధ్యతలను నరసరావుపేట 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి నిర్వహిస్తారు. రేపల్లె ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కె.మధుస్వామిని కాకినాడ 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు బదిలీచేశారు. రేపల్లె 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.ప్రదీపను అనకాపల్లి 3వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీచేశారు. ఆ స్థానంలో విశాఖపట్నం 7వ అదనపు మెట్రోపాలిటన మేజిస్ర్టేట్‌ ఎల్‌.జగదీష్‌కుమార్‌ను నియమించి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయననే ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు బాధ్యతలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. తెనాలి 3వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వై.ప్రేమలతను గాజువాక జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించి, ఆ స్థానంలో  విశాఖపట్నం 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.సీతను నియమించారు. బదిలీ అయిన న్యాయమూర్తులు తమ ప్రస్తుత స్థానాలను ఈ నెల 26లోగా విడనాడి ఆగస్టు 3లోగా కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. 

Updated Date - 2021-07-25T05:11:09+05:30 IST