వ్యాక్సిన్ తీసుకోలేదని ఓ తల్లికి వింత శిక్ష.. చికాగో జడ్జి సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-08-31T11:07:23+05:30 IST

కోవిడ్ టీకా వేయించుకోని ఓ మహిళకు చికాగోలోని ఓ జడ్జి భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా ఆమె కొడుకునే చూడకుండా దూరం చేస్తూ..

వ్యాక్సిన్ తీసుకోలేదని ఓ తల్లికి వింత శిక్ష.. చికాగో జడ్జి సంచలన తీర్పు

చికాగో: కోవిడ్ టీకా వేయించుకోని ఓ మహిళకు చికాగోలోని ఓ న్యాయమూర్తి భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా ఆమె కొడుకునే చూడకుండా దూరం చేస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో షాక్ తిన్న ఆ మహిళ పై కోర్టుల్లో అప్పీల్ చేసుకోబోతోంది. న్యాయమూర్తి కావాలనే ఇలాంటి తీర్పు ఇచ్చారని ఆమె ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రెబ్బేకా ఫిర్లిత్.. చికాగోలో నివశిస్తోంది. ఆమె భర్తతో 7ఏళ్ల క్రితం ఆమె విడాకులు తీసుకుంది. అప్పటికే 4 ఏళ్ల చిన్నారికి ఆమె తల్లి. విడాకుల సమయంలో ఇద్దరికీ సమానంగా బిడ్డ కస్టడీ ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి అలాగే కొనసాగుతోంది.


వ్యాక్సిన్లు తన శరీరానికి పడవని, అందువల్ల కోవిడ్ వ్యాక్సినే కూడా తీసుకొవద్దని, దానివల్ల ప్రమాదమని తన డాక్టర్ సూచించారని, అందువల్లే తాను వ్యాక్సినే తీసుకోలేదని ఫిర్లిత్ పేర్కొంది. న్యాయమూర్తి తనపై కావాలనే ఆయన సొంత ఆలోచనలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ‘‘కోర్టులో బిడ్డను చూసుకునేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితిపై, చిన్నారితో నా ప్రవర్తనపైనే దృష్టి సారిస్తారని భావించాను. అయితే తీర్పు తర్వాత ఇదేం తీర్పని ప్రశ్నించాను. దానికి ఆయన.. ‘ఇక్కడ నేనే న్యాయమూర్తిని. నీ కేసుపై నేనే నిర్ణయం తీసుకుంటాను’ అని అన్నారం’’టూ ఫిర్లిత్ వాపోయింది.


ఇలాంటి పరిస్థితుల్లోనే తల్లిదండ్రులిద్దరూ బిడ్డ కస్టడీకి సంబంధించి మళ్లీ కోర్టుకెక్కారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో జరిగిన కోర్టు విచారణలో.. కుక్ కౌంటీ న్యాయమూర్తి జేమ్స్ షాపిరో ఈ తీర్పు ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా..? అని ఫిర్లిత్‌ను జేమ్స్ ప్రశ్నించారు. దానికి ఆమె లేదని సమాధానమిచ్చింది. దీంతో ఆమె నుంచి బిడ్డ కస్టడీకి సంబంధించిన పూర్తి హక్కులనూ తొలగిస్తూ ఆయన తీర్పిచ్చారు. దీంతో షాకయిన ఫిర్లిత్.. పై కోర్టుకు అప్పీల్ చేసుకోనేందుకు సిద్ధమైంది.

Updated Date - 2021-08-31T11:07:23+05:30 IST