వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-05-21T07:12:29+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.తుకారాంజి శుక్రవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
స్వామి సేవలో పాల్గొన్న న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజి

ఐరాల(కాణిపాకం), మే 20: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.తుకారాంజి శుక్రవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T07:12:29+05:30 IST