జడ్జి రామకృష్ణను బేషరతుగా విడుదల చేయాలి: మాలమహానాడు

ABN , First Publish Date - 2021-04-18T06:43:02+05:30 IST

జడ్జి రామకృష్ణను బేషరతుగా విడు దల చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వరయ్య డిమాండ్‌ చేశా రు.

జడ్జి రామకృష్ణను బేషరతుగా విడుదల చేయాలి: మాలమహానాడు
పోస్టర్లతో మాలమహానాడు నాయకుల నిరసన

మదనపల్లె అర్బన్‌, ఏప్రిల్‌ 17: జడ్జి రామకృష్ణను బేషరతుగా విడు దల చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వరయ్య డిమాండ్‌ చేశా రు. శనివారం మదనపల్లెలోని ప్రెస్‌క్లబ్‌లో తమ కులసంఘ నాయకులతో నిరసన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు రోజలక్రితం పీలేరు పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా జడ్జి రామకృష్ణను అరెస్టు చేశారన్నారు.  ఒక టీవీ చానల్‌ చర్చలో సీఎం జగన్‌ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో జడ్జి రామకృష్ణను అరెస్టు చేయడం అప్రజాస్వామ్య మన్నారు. గతంలో నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ప్రస్తుత సీఎం జగన్‌ అప్పటి సీఎం చంద్రబాబును నడిరోడ్డులో కాల్చి చంపాలని పిలుపు నిచ్చారని, అప్పుడు జగన్‌కు వర్తించని చట్టం ఇప్పుడు జడ్జి రామకృష్ణకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. సీఎం జగన్‌ తన విధానాలను మార్చుకోవాలని లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జడ్జి కుమారుడు వంశీకృష్ణ మాట్లాడుతూ... ఇప్పుడు తన తండ్రి  చేసింది తప్పయితే అప్పుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలు తప్పే అని ఆయన్ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలో అందరికీ సమ న్యాయం కల్పించారని గుర్తు చేశారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారినే అణగ దొక్కడం  సబబు కాదన్నారు. జడ్జి రామకృష్ణను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా, కుల సంఘాలతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆంజనేయులు, కేవీ. రమణ, వెంకటరమణ, వంశీ కృష్ణ, ప్రదీప్‌కుమార్‌, జగన్‌మోహన్‌, జగన్‌, దళిత బహుజన ఫ్రంట్‌ నాయకులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:43:02+05:30 IST