Advertisement

మహిళల చేతిలో తీర్పు

Feb 23 2021 @ 23:40PM

మున్సిపాలిటీల్లో వారి ఓట్లే ఎక్కువ

ఆకట్టుకునేందుకే అభ్యర్థుల తంటాలు 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

సగానికి సగం పదవులనే కాదు పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తామే నిర్ణయిస్తామంటున్నారు మహిళా మణులు. పంచాయతీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్న విషయం తెలిసిందే. పట్టణ ప్రాంత ఎన్నికల్లోనూ అభ్యర్థుల భవితవ్యాన్ని వారే నిర్ణయించనున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో సైతం మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలే ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు విలువను గుర్తించి వినియోగించుకోవడంలో ముందువరుసలో ఉన్నారు. జిల్లాలో ఒక ఓటుతో సర్పంచి పదవిని గెలిచిన పరిస్థితి చూశాం. సింగిల్‌ డిజిట్‌తో భవితవ్యాలు తారుమారు కావడం విన్నాం. ఇటువంటి శక్తివంతమైన ఓటు అస్త్రాన్ని మహిళలే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మహిళా ఓటర్లపైనే మున్సిపాలిటీల్లో అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. వారిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభాల వల విసిరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా ప్రలోభ పెట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున పంపకాల కోసం సిద్ధం చేసిన ఆభరణాలు దొరికిపోవడం అప్పట్లో సంచలనమైంది. ఈసారి మూడో కంటికి తెలియకుండా పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. 


ఓటర్ల వివరాలు

---------------------------------------------------------------------

పట్టణం           మహిళలు  పురుషులు  మొత్తం

---------------------------------------------------------------------

విజయనగరం(కార్పొరేషన్‌) 1,03,177   99,012    2,02214(25)

పార్వతీపురం      19,414    18269      37,690(7)

బొబ్బిలి      23,627   22,335      45,967(4)

సాలూరు        20,522   18,291       38,792((1)

నెల్లిమర్ల(నగర పంచాయతీ) 9,501     9,296       18,798(1)

------------------------------------------------------------------------


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.