విద్య, ఆరోగ్యంపై రాజీ కుదరదు: సుప్రీం

ABN , First Publish Date - 2022-06-10T09:20:16+05:30 IST

విద్య, ప్రజారోగ్య విషయాల్లో రాజీకి తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విద్య, ఆరోగ్యంపై రాజీ కుదరదు: సుప్రీం

నీట్‌ పీజీ ప్రవేశాలపై తీర్పు నేటికి రిజర్వ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 9 : విద్య, ప్రజారోగ్య విషయాల్లో రాజీకి తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్‌ పీజీ- 2021 ప్రవేశాల విషయంలో దాఖలైన పిటిషన్ల పరిశీలన సందర్భంగా జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌తో కూడిన వేసవిసెలవుల ప్రత్యేక బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. నీట్‌ పీజీ అఖిల భారత కోటా కింద 2021లో కౌన్సెలింగ్‌ తర్వాత కూడా మిగిలిపోయిన 1,456 సీట్లను తమకు కేటాయించాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనల సందర్భంగా బుధవా రం జాతీయ వైద్యమండలిపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ దాఖలుచేసిన అఫిడవిట్‌పై గురువారం బెంచ్‌ మరోసారి స్పందించింది. వాదనల నమోదు అనంతరం బెంచ్‌.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2022-06-10T09:20:16+05:30 IST