
ఎన్నారై డెస్క్: న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(CJI NV Ramana) వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టిస్ అమెరికా పర్యటన పురస్కరించుకుని అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ఏర్పాటు చేసిన సన్మాన సభలో ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. తన చర్యలకు న్యాయవ్యవస్థ ఆమోదముద్ర ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే అధికారి పార్టీ నిర్ణయాలను న్యాయవ్యవస్థ విమర్శించాలని ప్రతిపక్షం ఆశిస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల పనతీరుపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఇటువంటి భావనల వ్యాప్తికి కారణమన్నారు. ‘‘కాబట్టి.. ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారి’’ అని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
రాజ్యంగ స్ఫూర్తికి అనుగూణంగా వివిధ వ్యవస్థల మధ్య సమతౌల్యత పాటించాలంటే ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థల పనితీరు పట్ల అవగాహన పెంపొందించాలని చీఫ్ జస్టిస్ అభిప్రాపపడ్డారు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యమని పునరుద్ఘాటించారు. ఇక.. అగ్రరాజ్యంలో అనేక విజయాలు సాధిస్తున్న భారత సంతతి వారిపై కూడా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పొగడ్తల వర్షం కురిపించారు. అమెరికా సమాజీనికున్న సహనశీలత, సమ్మిళిత స్వభావాల కారణంగానే వివిధ దేశాల్లోని భిన్న సంస్కృతుల వారు అగ్రరాజ్యం వైపు మళ్లుతున్నారని చెప్పారు. ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని గౌరవించడం ద్వారా సమాజంలోని అన్నివర్గాల్లో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పెంపొందించవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి