రజనీ యార్లగడ్డ ఆధ్వర్యంలో వైజాగ్‌లో ‘ది హ్యాండ్‌‌క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’

ABN , First Publish Date - 2022-07-14T00:51:46+05:30 IST

చేనేత ఉత్పత్తుల‌కు ఎప్పుడూ ఓ ప్రత్యేక‌త ఉంటుంది. ఏళ్లు గ‌డిచినా, ప్యాష‌న్ మారినా, చేనేత‌కు ఉండే ప్రాధాన్యత‌, ప్రాముఖ్యత అలానే ఉంటుంది. చేనేత ఉత్పత్తుల‌ను ప్రేమించే క‌ళ‌కారులు నిత్యం

రజనీ యార్లగడ్డ ఆధ్వర్యంలో వైజాగ్‌లో ‘ది హ్యాండ్‌‌క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’

చేనేత ఉత్పత్తుల‌కు ఎప్పుడూ ఓ ప్రత్యేక‌త ఉంటుంది. ఏళ్లు గ‌డిచినా, ప్యాష‌న్ మారినా, చేనేత‌కు ఉండే ప్రాధాన్యత‌, ప్రాముఖ్యత అలానే ఉంటుంది. చేనేత ఉత్పత్తుల‌ను ప్రేమించే క‌ళ‌కారులు నిత్యం వాటి కొనుగోలుకే ఆస‌క్తి చూపుతారు. అలాంటి చేనేత ఉత్పత్తుల‌తో కూడిన ప్రద‌ర్శన‌ను జూలై 15న..  ఒకే ఒక్క రోజు ‘ది హ్యాండ్‌క్రాఫ్టర్స్ - ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ పేరుతో విశాఖ‌ప‌ట్నంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు యార్లగ‌డ్డ ర‌జ‌నీ. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రఖ్యాతిగాంచిన చేనేత ఉత్పత్తుల‌ను ఒక చోట‌కి చేర్చి అందించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. త‌ద్వారా చేనేత క‌ళాకారుల‌కు చేయూత‌నివ్వడంతో పాటు చేనేత ఉత్పత్తుల‌ను క‌ళాభిమానుల చెంత‌కు ఆమె చేర్చనున్నారు. 


ఈ నెల 15న  విశాఖ‌ప‌ట్నంలోని నోవాటెల్ హోట‌ల్‌లో ఉదయం 9:30 గంటలకు ఈ ప్రద‌ర్శన‌ను ప్రారంభిస్తారు. నిర్మాత నాగసుశీల సమక్షంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనకు జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, భాజపా ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఒక రోజు మాత్రమే జరిగే ఈ ప్రద‌ర్శన‌లో దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప్రముఖ నేత కార్మికులు, డిజైనర్లు మరియు క్రాఫ్ట్ తయారీదారులు తమ కళల‌ను, ఉత్పత్తుల‌ను ఇక్కడ ప్రద‌ర్శించనున్నారు. ప్రధానంగా ఈ ప్రద‌ర్శన‌లో పటాన్ పటోలా, కంచి, బనారసి, జమ్దానీ, గద్వాల్, కోట, మంగళగిరి చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, పొట్లీలు, బ్యాంగిల్స్, హోమ్ లినెన్ బ్యాగులు మరియు డ్రెస్‌లను ప్రదర్శించనున్నారు. అలాగే, చేతితో తయారు చేసిన అనేక రకాల నగలు, విలువైన రత్నాలు మరియు వజ్రాల ప్రదర్శన కూడా ఉంటుందని కార్యక్రమ నిర్వాహకురాలు యార్లగ‌డ్డ ర‌జ‌నీ పేర్కొన్నారు.



Updated Date - 2022-07-14T00:51:46+05:30 IST