పాలమూరు నుంచే జంగ్‌ సైరన్‌

ABN , First Publish Date - 2021-10-05T05:00:43+05:30 IST

టీపీసీసీ సారథ్యం వహించాక రేవంత్‌రెడ్డి చేపడుతోన్న రెండో ప్రజాందోళన కార్యక్రమానికి పాలమూరు నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు.

పాలమూరు నుంచే జంగ్‌ సైరన్‌
మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి

ఈ నెల 12న కాంగ్రెస్‌ విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ

మహబూబ్‌నగర్‌లో రెండు లక్షల మందితో నిర్వహించేందుకు ప్లాన్‌

పీసీసీ పగ్గాలు చేపట్టాక రేవంత్‌కు సొంత జిల్లాలో తొలి సభ

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ 

ఆటంకాలెన్ని వచ్చినా సభ నిర్వహిస్తామని ధీమా

సభ అనుమతులపై సర్వత్రా చర్చ


టీపీసీసీ సారథ్యం వహించాక రేవంత్‌రెడ్డి చేపడుతోన్న రెండో ప్రజాందోళన కార్యక్రమానికి పాలమూరు నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్‌ 2 నుంచి డిసెంబరు 9 వరకు ఆ పార్టీ ప్రకటించిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌లో భాగంగా ఈనెల 12న మహబూబ్‌నగర్‌లో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. గత శనివారం హైదరాబాద్‌లో శ్రీకాంతాచారికి నివాళులు అర్పించడం ద్వారా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించగా, పోలీసులు భగ్నం చేశారు. దాంతో పాలమూరు కేంద్రంగా భారీ సభతో కార్యక్రమం మొదలుపెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 

- మహబూబ్‌ నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక, ఆయన సొంత జిల్లా పాల మూరులో మొదటి కార్యక్రమంగా విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ నిర్వహించనున్నారు. దాంతో సభ విజయవంతం చేయడాన్ని ఆ పార్టీ సవాల్‌గా తీసుకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, సీఎల్పీ నాయ కుడు మల్లు భట్టివిక్రమార్క ఇతర కాంగ్రెస్‌ నాయకులు హాజరు కానున్నారు. దాంతో సభ విజయవంతం కోసం అవసరమైన కార్యాచరణపై పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి ఇప్పటికే రెండు దఫాలు ఉమ్మడి జిల్లా నాయకులతో చర్చలు జరిపారు. మహబూబ్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యంలో సోమవారం జరిగిన సమావేశంలో సభ విజయవంతంపై చర్చించారు. సభకు కనీసం రెండు లక్షల మంది స్వచ్ఛందంగా వస్తారని పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలని సీనియర్లు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ ట్యాగ్‌లైన్‌గా ప్రచారం చేసిన ఉద్యోగాల కల్పన విషయంలో ఏడేళ్ల సర్కార్‌ విఫలం చెందిన ప్రధాన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌లో ఉన్న రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల కోరడంతో పాటు, టీఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్ధానమైన రూ.3,016 నిరుద్యో గభృతి పథకం తక్షణం అమలు చేయాలనే డిమాండ్లను ఈ సభ వేదికగా విద్యార్థి, నిరుద్యోగుల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, ఏడేళ్లలో ఉద్యోగాల కల్పనకు అవసరమైన నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సభను విజయవంతం చేసేం దుకు కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ నాయకత్వం పిలుపు నిచ్చింది. సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్‌ నాగం జనార్దన్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు డాక్టర్‌ చిన్నారెడ్డి, ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌, పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షు డు శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, పీసీసీ కార్యదర్శులు జి.మధు సూదన్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్‌, వీర్లపల్లి శంకర్‌, అనిరుధ్‌రెడ్డి, ప్రదీప్‌కు మార్‌గౌడ్‌, వాకిటి శ్రీహరి, బెక్కరి అనితారెడ్డి, కె.ప్రశాంత్‌రెడ్డి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు. 


విద్యార్థి, నిరుద్యోగులు స్వచ్ఛందంగా వస్తారని ధీమా

మహబూబ్‌నగర్‌లో నిర్వహించే విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, నిరుద్యోగులు స్వచ్ఛం దంగా తరలివస్తారని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాల్లోపు వయ సు వారే ఉన్నారని, వారందరికీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన ఏ హామీనీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదని, వారంతా ఈసభకు వస్తారని అంచనా వేస్తున్నారు. 14 నియోజకవర్గాల్లోని విద్యార్థి, నిరుద్యోగులను సభకు రప్పించేలా ఈ వారం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అయితే కాంగ్రెస్‌ ఒక వైపు సభకు ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు సభకు అనుమ తుల విషయంలో ప్రభుత్వం ఎలా స్పంది స్తుందోననే చర్చ సాగుతోంది. ఈ నెల 2న హైదరాబాద్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించే నిమిత్తం ఆ రు కిలోమీటర్ల పాదయాత్ర, మౌనప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తేనే పోలీసులు అడ్డు కున్న నేపథ్యంలో పాలమూరులో భారీ బహి రంగ సభ నిర్వహణ ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరునూరైనా సభను సక్సెస్‌ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు పని చేస్తాయని, విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన తమ పార్టీ నిలుస్తుందని ఎన్ని ఆటంకాలె ఎదురైనా సభ నిర్వహించి తీరుతామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


విజయవంతం చేసి తీరుతాం

మహబూబ్‌నగర్‌,(ఆంధ్రజ్యోతి): మహ బూబ్‌నగర్‌ పట్టణంలో పీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 12న నిర్వహించనున్న విద్యార్థి, నిరు ద్యోగ జంగ్‌ సైరన్‌ సభను విజయవంతం చేసి తీరుతామని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, సీఎల్పీ నాయకుడు మల్లుభట్టి విక్రమార్క పాల్గొనే ఈ సభ నిర్వహణపై సోమవారం మహబూ బ్‌నగర్‌ డీసీసీ కార్యాలయంలో  సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఏఐసీసీ కార్య దర్శులు డాక్టర్‌ చిన్నారెడ్డి, ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ నా గం జనార్దన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ ఉపాఽ ధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి, యువజన కాం గ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి,  డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుం చి ఈ సభకు రెండు లక్షల పైచిలుకు విద్యార్థి, నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలి వస్తారని నాగం జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి తెలిపారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఈ సభ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో రాష్ట్రంలో విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని చెప్పారు. ఎన్ని కల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోలీ సులు, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించి నా సభ నిర్వహించి తీరుతామని, పాల మూరు గడ్డపై విద్యార్థి, నిరుద్యోగుల సత్తా చాటుతామని వేం నరేందర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిర్వహించే సభ కు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాలని కోరారు. సమావేశం అనంతరం సభ నిర్వహణకు అవసరమైన స్థలాలను పార్టీ నాయకులు పరిశీలించారు.  సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర ప్రసాద్‌, సురేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శులు జీ.మధుసూదన్‌రెడ్డి, జె.అనిరుధ్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్‌, వినోద్‌కుమార్‌, వీర్లపల్లి శంకర్‌, వాకిటి శ్రీహరి, పీసీసీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌గౌడ్‌, కె.ప్రశాంత్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అనితారెడ్డి, సంజీవ్‌ ముదిరాజ్‌, సీజే బెనహర్‌, జే.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-05T05:00:43+05:30 IST