లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువులు

ABN , First Publish Date - 2022-08-15T20:55:14+05:30 IST

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌(జేఈ) ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు

లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువులు

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌(జేఈ) ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌-బి(నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టు(Junior Engineer Post)ల్లో నియమితులవుతారు.

నియామకాలు-విభాగాలు: జూనియర్‌ ఇంజనీర్‌గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్‌ స్టేషన్‌, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌, పోర్ట్స్‌, షిప్పింగ్‌ అండ్‌ వాటర్‌వేస్‌ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

అర్హతలు: డిప్లొమా(సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌), తత్సమాన డిగ్రీ చదివిన వారు అర్హులు.

వయోపరిమితి: పోస్టులను అనుసరించి 18 - 32 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉంటాయి. భారతీయులై ఉండాలి. 

జీతభత్యాలు: ఏడో వేతన సంఘం ప్రకారం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.

పరీక్ష విధానం: రెండు దశల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1 ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-1(డిస్ర్కిప్టివ్‌) ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పేపర్‌-1లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌-2 మొత్తం 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు ఫీజు: రూ.100(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరి తేదీ: సెప్టెంబరు 2

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Updated Date - 2022-08-15T20:55:14+05:30 IST