Jurala project: 12 గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-18T12:25:07+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‎ఫ్లో 83 వేల

Jurala project: 12 గేట్ల ఎత్తివేత

మహబూబ్‎నగర్: జూరాల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‎ఫ్లో 83 వేల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్‎ఫ్లో 86,673 క్యూసెక్కులు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 318.420 మీటర్లు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 9.459 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-18T12:25:07+05:30 IST