జస్టిస్ ఈశ్వరయ్య కేసు... దర్యాప్తునకు ఆదేశించకుండా ఉండాల్సిందన్న సుప్రీం

ABN , First Publish Date - 2021-04-12T18:28:42+05:30 IST

మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో హైకోర్టు దర్యాప్తు ఆదేశాలపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది.

జస్టిస్ ఈశ్వరయ్య కేసు... దర్యాప్తునకు ఆదేశించకుండా ఉండాల్సిందన్న సుప్రీం

ఢిల్లీ: మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో హైకోర్టు దర్యాప్తు ఆదేశాలపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దర్యాప్తునకు హైకోర్టు అదేశించకుండా ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని తెలిపింది. దర్యాప్తు అంశాన్ని ఏపీ హైకోర్టు మరోసారి పరిశీలించాలని ధర్మాసనం సూచించింది.


జడ్జి రామకృష్ణతో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన ఫోన్‌ సంభాషణపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌తో హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జస్టిస్‌ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


Updated Date - 2021-04-12T18:28:42+05:30 IST