కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండ వర్గాలకు న్యాయం : భాస్కర్‌రావు

ABN , First Publish Date - 2021-05-10T06:54:30+05:30 IST

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.

కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండ వర్గాలకు న్యాయం : భాస్కర్‌రావు
పేద ముస్లింలకు కానుకలు అందిస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ, మే 9 : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక సీతారాంపురం చిన్న మసీద్‌లో పేద ముస్లీంలకు రంజాన కానుకలు పంపిణీ చేసి మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కా ర్యక్రమాలు చేపట్టిందన్నారు. ముస్లిం ఆడబిడ్డలకు షాదీ మబారక్‌, మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు ఉచిత విద్య, విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి రూ.20లక్షల ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్నందున భౌతికదూరం పా టిస్తూ రంజాన పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రోమితసింగ్‌, తహసీల్దార్‌ గణేష్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన కుర్ర విష్ణు, ఏఎంసీ చైర్మన చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, చిన్న మసీద్‌ అధ్యక్షుడు పాష, ముస్లిం మత పెద్దలు, కౌన్సిలర్లు ఇలియాస్‌, ఖాదర్‌, రమేష్‌, బాసాని గిరి పాల్గొన్నారు.
నల్లగొండ, మే 9 : రంజాన్‌ పండుగను పురస్కరించుకుని రహాత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో 400మంది పేద ముస్లిం కుటుంబాలకు ఆదివారం  పండుగ సామగ్రి, నగదు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎం ఏ.బషీర్‌ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మాదిరిగా పేద ముస్లింలు రంజాన్‌ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సామగ్రి అందించామన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు జలీస్‌, ఖలీల్‌, రజ్జఖ్‌ పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన : హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ముస్లింలకు ఆదివారం రంజాన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మునీర్‌ మాట్లాడుతూ రంజాన మాసాంతం చేసే ఉపవాస దీక్షలు సేవాగుణాన్ని అలవరుస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల సందీప్‌, మాలోతు శ్రీను, సుదర్శనరెడ్డి, యాదగిరి, శ్రీనివాసరెడ్డి, కల్యాణ్‌, అమీర్‌, రోహిత, ప్రవీణ్‌, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు : రంజాన మాసం నేపథ్యంలో రజక సంఘం మండల అధ్యక్షుడు లింగస్వామి మండలకేంద్రంలోని ముస్లిం కుటుంబాలకు ఆదివారం ఇఫ్తార్‌ విందు పొట్లాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాఖీర్‌, ఉనీద్‌, హుస్సేన, శంకర్‌, నాగుల్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.
నిడమనూరు : ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. రంజాన పండుగ సందర్భంగా మండలంలోని ముకుందాపురంలో ముస్లింలకు రంజాన తోఫా కింద దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ కేశ శంకర్‌, నాయకులు రామంజయ్య, గండికోట యాదగిరి, సలీం, వంగాల వెంకన్న, జానిమియా, ఇబ్రహీం, ఉస్మానఫాతిమా, సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:54:30+05:30 IST