సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ అమెరికా పర్యటన ఖరారు

ABN , First Publish Date - 2022-06-21T01:27:49+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్‌వీ రమణ దాదాపు పది రోజుల పర్యటన కోసం అమెరికాకు రానున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ అమెరికా పర్యటన ఖరారు

న్యూయార్క్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు అమెరికాలో చీఫ్ జస్టిస్ రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ, వర్జీనియా, కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను ప్రధాన న్యాయమూర్తి సందర్శిస్తారు. స్థానికంగా ఉన్న భారతీయ సంఘాలు, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. ఈనెల 24న న్యూజెర్సీలో, 25వ తేదీన వర్జీనియాలో, జులై 1వ తేదీన సిలికాన్ వ్యాలీలోని ప్రవాసులతో ఆయన భేటీ అవుతారు. 







Updated Date - 2022-06-21T01:27:49+05:30 IST