Chief Justice of India: సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-08-27T16:50:34+05:30 IST

భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India) (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్...

Chief Justice of India: సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India) (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్(Justice UU Lalit) శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము(President of India Droupadi Murmu) జస్టిస్ యు.యు.లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ  ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ (Vice President Jagdeep Dhankhar) ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi),పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ యు.యు.లలిత్ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ(Justice NV Ramana)కూడా పాల్గొన్నారు.


Updated Date - 2022-08-27T16:50:34+05:30 IST