అందరికీ సమన్యాయమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-27T06:44:13+05:30 IST

సమాజంలో ప్రతి ఒక్కరికీ సమ న్యాయం అందించడమే లక్ష్యంగా లోక్‌ అదాలత్‌ పనిచేస్తోందని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బాలకృష్ణయ్య అన్నారు.

అందరికీ సమన్యాయమే లక్ష్యం
చట్టాలపై అవగాహన కల్పిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి బాలకృష్ణయ్య

 పెదవేగి, అక్టోబరు 26: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమ న్యాయం అందించడమే లక్ష్యంగా లోక్‌ అదాలత్‌ పనిచేస్తోందని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బాలకృష్ణయ్య అన్నారు. పెదవేగి కాఫీపొడి ఫ్యాక్టరీలో మంగళవారం ఫ్యాక్టరీ కార్మికులకు చట్టాలు, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ నెల రెండవ తేదీ నుంచి గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులు వచ్చేనెల 14వ తేదీ వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. న్యాయవాదులు కె. కృష్ణారావు, విజయభాస్కర్‌, ఫ్యాక్టరీ  ఎండీ సుందరరామరాజు పాల్గొన్నారు.

దెందులూరు:  విద్యార్థులు  ర్యాగింగ్‌ జోలికి వెళ్ళవద్దని సీనియర్‌ సివిల్‌ జడ్జి  బాలకృష్ణయ్య అన్నారు. మంగళవారం  గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ వ్యాయామ విద్యా కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సలీం బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణయ్య మాట్లా డుతూ బాలికలు ర్యాగింగ్‌ బారిన పడకుండా కఠిన చట్టాలు ఉన్నాయన్నారు. ప్యానల్‌ అడ్వొకేట్‌ భాస్కర్‌, కృష్ణారావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అనం తరం సానిగూడెం సాయి వృద్ధాశ్రమంలో వృద్ధుల హక్కులపై వివరించారు. వారికి న్యాయ సహాయం ఉచితంగా అందిస్తామన్నారు. 

Updated Date - 2021-10-27T06:44:13+05:30 IST