జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు

ABN , First Publish Date - 2022-05-27T09:42:09+05:30 IST

భారత అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజి (22) సంచలన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న డి హ్యారీ షట్లింగ్‌ గేమ్స్‌ 100మీ.

జ్యోతి మళ్లీ జాతీయ రికార్డు

న్యూఢిల్లీ: భారత అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజి (22) సంచలన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న డి హ్యారీ షట్లింగ్‌ గేమ్స్‌ 100మీ. హర్డిల్స్‌ హీట్స్‌లో ఈ ఆంధ్ర అథ్లెట్‌ 13.04సెకన్ల టైమింగ్‌ సాధించింది. దీంతో జ్యోతి గత రెండు వారాల్లో తన రికార్డులను తనే అధిగమిస్తూ మూడోసారి జాతీయ రికార్డును నెలకొల్పడం విశేషం. ఆదివారం ఇంగ్లండ్‌లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో 13.11సె. టైమింగ్‌ను,  ఈనెలారంభంలో 13.23 సెకన్లతో తొలిసారి 20 ఏళ్ల జాతీయ రికార్డును అధిగమించింది.

Updated Date - 2022-05-27T09:42:09+05:30 IST