అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

Nov 29 2021 @ 00:32AM
గుంతకల్లులో పూలే విగ్రహం వద్ద నివాళులు

గుంతకల్లు టౌన, నవంబరు 28: సమాజంలో అణగారిన వర్గాల అ భ్యున్నతి, విద్యాభివృద్ధికి పాటుపడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వక్తలు కొనియాడారు. ఆదివారం పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ క ళాశాలలో మహనీయుల సంస్మరణ సేవా సమితి, దళిత ఐక్య వేదిక, బీ ఎస్పీ ఆధ్వర్యంలో వేర్వేరుగా పూలే వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు మాధవరావు, మస్తాన, ఎనసీసీ అధికారి బాలకృష్ణ, ఏ ఆనంద్‌, సూరి, రా జు, ఆలం నవాజ్‌, శ్రీనివాసరాజు, నరసన్న, రాధాకృష్ణ, వలి పాల్గొన్నారు.


గుత్తి: ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానికంగా పూలే విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. నాయకులు దేశాయి నాగరాజు, రామచంద్ర, జయకుమార్‌, దాదా, శ్రీనివాసులు, ప్రేమావతి, నూర్‌మహమ్మద్‌, మాణి క్యం, రవిప్రకాష్‌, రాజేష్‌ పాల్గొన్నారు. వైసీపీ నాయకులు భీమలింగ, జీఎం బాషా ఆధ్వర్యంలో స్థానికంగా పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. 


పామిడి: పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో పలు ప్రజా సంఘాల ఆ ధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో బడుగు, బలహీనవర్గాల అభ్యునతికి పూలే ఎనలేని కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకయ్య, ఓబులేశు, అనిమిరెడ్డి, కే రహీమ్‌, ఓబులేశు యాదవ్‌, నారాయణ మూర్తి పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం: స్థానిక ఎన్టీఆర్‌ భవనలో టీడీపీ ఆధ్వర్యంలో పూలే చి త్రపటం వద్ద నివాళులర్పించారు. పట్టణ కన్వీనర్‌ మాదినేని మురళి, నా యకులు నాగరాజు, వెంకటేష్‌, శీనా, హరి, అనిల్‌, రామాంజినేయులు, పరమేష్‌, వడ్డే రామకృష్ణ, ఈశ్వర్‌ పాల్గొన్నారు.


ఉరవకొండ: ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గోపా ల్‌ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలోని పూలే విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్‌, మధుప్రసాద్‌, పురుషోత్తం, రాజేష్‌ పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.