Advertisement

దర్శకేంద్రుని మరో అవతారం..!

Oct 26 2020 @ 14:24PM

శతాధిక చిత్రాల దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. కమర్షియల్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈ సీనియర్‌ దర్శకుడు ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నారట. సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సమాచారం మేరకు రాఘవేంద్రరావు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నారట. ఎప్పుడూ కెమెరా వెనుక ఉండే ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారట. అంటే రాఘవేంద్రరావు నటుడిగా మారుతున్నారట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రాఘవేంద్రరావుని హీరోగా పెట్టి ఓ సినిమా చేయనుందట. ఇందులో ఆయనకు జోడీగా ముగ్గురు హీరోయిన్స్‌ నటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలో నిజముంటే మాత్రం.. అసలు ఏం చెప్పి దర్వకేంద్రుడ్ని నటింప చేయడానికి ఒప్పించారు! అనేది ఇప్పటి కి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.