Karnataka ర్యాలీలో పాల్గొన్న వీరప్పమొయిలీతోపాటు నలుగురు కాంగ్రెస్ నేతలకు కరోనా

ABN , First Publish Date - 2022-01-13T15:48:00+05:30 IST

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్న సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీకి కరోనా పాజిటివ్ అని తేలింది....

Karnataka ర్యాలీలో పాల్గొన్న వీరప్పమొయిలీతోపాటు నలుగురు కాంగ్రెస్ నేతలకు కరోనా

బెంగళూరు:కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్న సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకరరెడ్డిలకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా వచ్చిన ఇద్దరు నేతలతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సన్నిహితంగా ఉన్నారు.కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఆరోగ్య శాఖ అధికారులను పంపించింది. అయితే డీకే శివకుమార్ కొవిడ్ పరీక్షకు నిరాకరించారు.


కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టినందుకు డీకే శివకుమార్ తో సహా 64 మంది కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో రామనగర కార్యాలయంలో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు.


Updated Date - 2022-01-13T15:48:00+05:30 IST