వరంగల్‌లో కేఏపాల్ హల్ చల్

ABN , First Publish Date - 2022-05-01T01:11:45+05:30 IST

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు.

వరంగల్‌లో కేఏపాల్ హల్ చల్

హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. సీపీని కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ధర్నాకు దిగుతానని పాల్  హెచ్చరించడంతో  పోలీసులు అనుమతించారు.  ఈ సందర్భంగా కేఏపాల్  మీడియాతో మాట్లాడుతూ.. మే 6వ తేదీన నిర్వహించే సమావేశానికి పర్మిషన్ కోసం ఏప్రిల్ 22వ తేదీన అనుమతి కోరుతూ లేటర్ రాశానని.. కాని తనకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదన్నారు. తన సభకు అనుమతి ఇవ్వకుండా  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందన్నారు. 


తానేవరో తెలియదని సీపీ మాట్లాడాడని మండిపడ్డారు. ధర్నా చేస్తానంటే సీపీ ఆఫీస్ లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పారు.గవర్నర్ తమిళిసైకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం ఎలా అవుతాడో తాను చూస్తానని సవాల్ విసిరాడు.ఇప్పటికైనా పోలీసు అధికారులు కళ్లు తెరవాలన్నారు. ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారని, తానంటే ఏంటో ప్రపంచ దేశాలకు తెలుసునని ఆఫ్ట్రాల్  కేసీఆర్‌కు తెలియదా అని నిలదీశారు. రైతుల కోసం తానెక్కడ ఉద్యమం చేస్తానోనని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.  కేసీఆర్ బంగారు తెలంగాణ కాదు కదా వెండి తెలంగాణ కూడా తేలేదని సెటైర్లు వేశారు. తెలంగాణ అప్పుల తెలంగాణ అయ్యిందని ధ్వజమెత్తారు.మే 6వ తేదీన తన సభకు అనుమతి ఇవ్వాలని...లేదా రాహుల్ గాంధీ సభ అనుమతి రద్దు చేయాలన్నారు.తనకు పర్మిషన్ ఇవ్వకుంటే కోర్టుకైనా వెళ్తానని కేఏపాల్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-01T01:11:45+05:30 IST