Advertisement

కార్తీక శని త్రయోదశిని పురస్కరించుకుని చాకరిమెట్లలో భక్తుల కోలాహలం

Nov 29 2020 @ 00:14AM
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పురోహితులు

శివ్వంపేట, నవంబరు 28: కార్తీక మాసం శనిత్రయోదశి పురష్కరించుకుని చిన్నగొట్టిముక్ల అటవీప్రాంతంలో వెలసిన చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సమూహిక వ్రతాలు ఆచరించారు. ఆలయ చైర్మన్‌, ప్రధాన పూజారి ఆంజనేయశర్మ, పూజారులు దేవదత్తశర్మ, ప్రభురాజుశర్మ, దేవీప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యనిర్వాహణ అధికారి శశిధర్‌ ఆఽధ్వర్యంలో భక్తుల సౌకర్యం కోసం చర్యలు తీసుకున్నారు. అలాగే, శనిత్రయోదశి సందర్భంగా మున్సిపల్‌ చైౖర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ బస్టాండు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Follow Us on:
Advertisement