కబాబ్స్‌

ABN , First Publish Date - 2022-03-12T19:09:44+05:30 IST

హంగ్‌ కర్డ్‌ - రెండు కప్పులు, పనీర్‌ - కప్పు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, డ్రైఫ్రూట్స్‌ - రెండు

కబాబ్స్‌

కావలసినవి: హంగ్‌ కర్డ్‌ - రెండు కప్పులు, పనీర్‌ - కప్పు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, డ్రైఫ్రూట్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలు - అర టీస్పూన్‌, బ్రెండ్‌ క్రంబ్స్‌ - పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా. 


తయారీ విధానం: ఒక బౌల్‌లో హంగ్‌ కర్డ్‌ తీసుకుని అందులో పనీర్‌ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, దంచిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్‌, మిరియాల పొడి, బ్రెడ్‌ క్రంబ్స్‌, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మిశ్రమం మెత్తగా ఉన్నట్లయితే మరికొన్ని బ్రెడ్‌ క్రంబ్స్‌ కలుపుకోవాలి. బ్రెడ్‌ ముక్కల పొడి తడిని లాగేస్తుంది.  ఇప్పుడు అర చేతులకు నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కబాబ్స్‌లా చేసుకోవాలి.  వీటికి కార్న్‌ఫ్లోర్‌ అద్దుతూ నూనెలో వేసి వేయించుకోవాలి.  పుదీనా చట్నీతో తింటే ఈ హంగ్‌కర్డ్‌ కబాబ్‌లు రుచిగా ఉంటాయి. హంగ్‌ కర్డ్‌ తయారీ ఇలా... ఒక బౌల్‌ పైన సన్నని వడబోత జల్లెడ పెట్టి దాని పైన పలుచటి వస్త్రం వేసి అందులో పెరుగు వేయాలి. తరువాత వస్త్రంను బిగుతుగా కట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టాలి.  ఇలా చేయడం వల్ల పెరుగులో ఉన్న నీరంతా వస్త్రంలో నుంచి బౌల్‌లోకి చేరుతుంది. చివరగా వస్త్రంలో క్రీమ్‌లాంటి పెరుగు మిగులుతుంది. ఇదే హంగ్‌ కర్డ్‌. ఇది సూపర్‌ మార్కెట్లలో రెడీమేడ్‌గా కూడా లభిస్తుంది.

Updated Date - 2022-03-12T19:09:44+05:30 IST